సీఎంకు అంబటి క్షమాపణ చెప్పాలి: TNSF అధ్యక్షులు గండ్రకోటి

7చూసినవారు
సీఎంకు అంబటి క్షమాపణ చెప్పాలి: TNSF అధ్యక్షులు గండ్రకోటి
గుంటూరులో మాజీ మంత్రి, వైసీపీ నాయకులు అంబటి రాంబాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలను నల్లజర్ల మండలం TNSF అధ్యక్షులు గండ్రకోటి దుర్గాప్రసాద్ తీవ్రంగా ఖండించారు. శనివారం నల్లజర్లలో ఆయన మాట్లాడుతూ, అంబటి రాంబాబు తక్షణమే ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పినా, ఆ పార్టీ నాయకులకు సిగ్గు రాలేదని విమర్శించారు. టీడీపీయే నిబద్ధత కలిగిన పార్టీ అని దుర్గాప్రసాద్ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్