చిన్నాయిగూడెం శివారులో ఆటో బోల్తా

3చూసినవారు
దేవరపల్లి మండలం చిన్నాయిగూడెం శివారులో బుధవారం మహిళా కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో సహా 11 మంది కూలీల్లో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రులను కొయ్యలగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న దేవరపల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.