గోపాలపురం మండలం చిట్యాల - పెద్దాపురం గ్రామాల మధ్య ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి కిందపడటంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని గజ్జరం గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా, క్షతగాత్రులను గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు.