కంటైనర్ ను ఢీకొట్టిన కారు

2చూసినవారు
కంటైనర్ ను ఢీకొట్టిన కారు
తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం జాతీయ రహదారిలో గండి చెరువు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వాడపల్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ఏలూరు వైపు వెళుతున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని, ఎదురుగా వస్తున్న కంటైనర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. దేవరపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వాహనాలను పక్కకు తొలగించి, రాకపోకలను పునరుద్ధరించారు.