స్కూటీనీ ఢీ కొట్టిన కారు.. ముగ్గురికి గాయాలు

2చూసినవారు
స్కూటీనీ ఢీ కొట్టిన కారు.. ముగ్గురికి గాయాలు
దేవరపల్లి మండలం గౌరీపట్నం పరిధిలోని కొండగూడెం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు గాయపడ్డారు. రోడ్డుపై వెళ్తున్న స్కూటీని గుర్తుతెలియని కారు బలంగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన ముగ్గురిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గాయపడిన యువకులు సోలార్ సిస్టమ్‌లో పనిచేస్తున్నట్లు తెలిసింది.

ట్యాగ్స్ :