గౌరీపట్నం హైవేపై కారు బోల్తా: నలుగురికి తీవ్ర గాయాలు

0చూసినవారు
తూర్పు గోదావరి జిల్లా, దేవరపల్లి మండలం, గౌరీపట్నం హైవేపై శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏలూరు నుంచి విశాఖపట్నం వెళ్తున్న కారు గౌరీపట్నం వద్దకు రాగానే టైరు పేలి, డివైడర్ కంచెను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం గురించి పోలీసులకు సమాచారం అందించి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

సంబంధిత పోస్ట్