
బెంగళూరులో ఉగాండా మహిళకు ఎబోలా వంటి లక్షణాలు!
బెంగళూరులో ఉగాండాకు చెందిన 28 ఏళ్ల మహిళలో ఎబోలా లక్షణాలు కనిపించాయి. ఈ నెల 23న ఉగాండా నుంచి బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు, స్క్రీనింగ్‌లో తేలికపాటి లక్షణాలు గుర్తించారు. ముందుజాగ్రత్తగా ఆమెను ఆస్పత్రికి తరలించి, శాంపిల్స్‌ను పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV)కి పరీక్షల కోసం పంపించారు. రెండు రోజుల్లో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎబోలాపై ఆందోళనలు నెలకొన్నాయి.




