సీఎం పర్యటన: 1200 మంది పోలీసులతో బందోబస్తు

34చూసినవారు
తూగో జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో, జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ పోలీసు అధికారులను అప్రమత్తం చేశారు. ముఖ్యమంత్రి బందోబస్తు కోసం 1200 మంది పోలీసులను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. హిడ్మా ఎన్ కౌంటర్ తర్వాత పోలీసులు అదనపు జాగ్రత్తలు పాటించాలని, అనుమానాస్పదంగా కనిపించిన వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి సభ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని, ఏజెన్సీ ప్రాంతాలు సమీపంలో ఉన్నందున మరింత జాగ్రత్త వహించాలని డీఎస్పీ, సీఐ, ఎస్సైలకు సూచనలు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్