దేవరపల్లి పొగాకు వేలం కేంద్రం వద్ద
వైసీపీ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు తలారి వెంకటరావు, తానేటి వనిత పాల్గొన్నారు. ప్రభుత్వం పొగాకు కొనుగోళ్లను వేగవంతం చేసి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని వారు డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని వారు విమర్శించారు.