దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామంలో శనివారం పింఛన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. డిసెంబర్ నెల ఒకటో తారీకు ఇవ్వాల్సిన పింఛన్ ఆదివారం అవడంతో ఒకరోజు ముందు ఇచ్చారు. పింఛన్దారులు ఒకరోజు ముందు పింఛన్ ఇవ్వడంతో హర్షం వ్యక్త పరిచారు. స్థానికంగా గ్రామ పంచాయతీ సచివాలయం అగ్రికల్చర్ ఆఫీసర్ నవీన్ కుమార్, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.