తూర్పు గోదావరి జిల్లా, నల్లజర్ల లోని శ్రీ లక్ష్మి మల్టీ ప్లెక్స్ వద్ద గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'పెద్ది' సినిమా విడుదల సందర్భంగ
ా జనసేన నాయకురాలు దిరిసిన ఫాతిమారాణి 70 అడుగుల భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. కేరళ వాయిద్యాలు, తీన్మార్ డప్పులు, బాణాసంచా పేలుళ్ల మధ్య చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంల
ో జనసేన పార్టీ నాయకులు, మెగా అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 'పెద్ది' ప్రీమియం సెలెబ్రేషన్స్ ఘనంగా జరిగాయి.