నల్లజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో (PHC) బుధవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు రూ. 15 లక్షల విలువైన మందులు దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు. తాడేపల్లిగూడెం ఫైర్ ఇంజన్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.