
14 ఏళ్ల బాలికపై పెంపుడు తండ్రి, బావమరిది అత్యాచారం.. గర్భం దాల్చిన బాలిక
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో 14 ఏళ్ల బాలికపై పెంపుడు తండ్రి, అతని బావమరిది కొద్ది నెలలుగా అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాలిక గర్భం దాల్చడంతో అసలు విషయం బయటపడింది. ఆదివారం బాలిక అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా, ఐదు నెలల గర్భవతి అని వైద్యులు తెలిపారు. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు పెంపుడు తండ్రి, బావమరిదిపై పోక్సో కేసు నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు.




