గోపాలపురంలోని పట్టిసీమ ఎత్తిరోతల కాలువ వద్ద సోమవారం ఉదయం చేపలు పట్టడానికి వెళ్లి యువకుడు బత్తుల మహేశ్ గల్లంతయ్యాడు. అతనితో పాటు ఉన్న మరో వ్యక్తి స్థానికులకు సమాచారం అందించడంతో గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.