రాజమండ్రి మరియు పరిసర ప్రాంతాలలో మంగళవారం సాయంత్రం నుంచి బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాష్ నగర్, కోటిపల్లి బస్టాండ్, మోరంపూడి వంటి ప్రాంతాలలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రానున్న రెండు గంటల్లో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.