దుద్దుకూరులోని భవిత పాఠశాలలో మంగళవారం ది సర్వ్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చిన్నారుల వేషధారణలు ఆకట్టుకోగా, చక్కటి ప్రదర్శన చేసిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ-2, ప్రధానోపాధ్యాయులు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.