
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే తొక్కిసలాట.. సమగ్ర దర్యాప్తు చేయాలి: బొత్స
AP: కాశీబుగ్గ తొక్కిసలాట దురదృష్టకరమని వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మరణించిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇలాంటి సంఘటనలు మూడుసార్లు జరిగాయని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇది జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న మూడు పార్టీలు సనాతన ధర్మం గురించి పెద్ద మాటలు మాట్లాడుతున్నాయని, చంద్రబాబు, లోకేష్, ఆనం బాధ్యత వహిస్తారా? అని నిలదీశారు.




