నల్లజర్ల మండలం తూర్పు చోడవరం గ్రామంలో బుధవారం శ్రీశ్రీశ్రీ విజయదుర్గ విశ్వేశ్వర సహిత అయ్యప్ప స్వామి వారి దివ్య విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు పాల్గొన్నారు. వారు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ అభివృద్ధికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు.