గోపాలపురం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు బుధవారం పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో, నల్లజర్ల – పోతవరం రోడ్ వద్ద హెలిప్యాడ్, సభా స్థలాలను కలెక్టర్ కీర్తి చేకూరి, ఆర్డీవో సుస్మితారాణి, జిల్లా అధికారులు, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మంగళవారం పరిశీలించారు. సీఎం పర్యటన సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.