నిడదవోలులో రాష్ట్ర ఓబిసి మోర్చా అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం సమావేశం జరిగింది. పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని, శక్తి కేంద్రాలు, బూత్ కమిటీలు, క్రియాశీల సభ్యులను పెంచాలని నాయకులకు సూచించారు. పట్టణ అధ్యక్షులు మోర్త ప్రమోద్ కుమార్, టంగుటూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.