
పొగాకు ఉత్పత్తులపై కొత్త జీఎస్టీ.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం
పొగాకు ఉత్పత్తులపై కొత్త జీఎస్టీ అమలుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకం, పాన్ మసాలాలపై సెస్ విధిస్తున్నట్లు ప్రకటించింది. జనవరి 1న ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్లు, పొగాకు, సంబంధిత ఉత్పత్తులపై 40 శాతం జీఎస్టీ అమలు చేయనుంది. GSTతో పాటు పాన్ మసాలాలపై ‘హెల్త్ అండ్ నేషనల్ సెక్యూరిటీ సెస్’ కూడా ఉంటుంది.




