దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామంలో బుధవారం జనవరి నెలకు సంబంధించిన పింఛన్లను ఒకరోజు ముందుగానే పంపిణీ చేశారు. జనవరి 1వ తేదీన ఇవ్వాల్సిన పింఛన్లను ముందుగా అందించడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ రాజమండ్రి పార్లమెంటరీ రైతు సంఘం అధ్యక్షులు ముళ్ళపూడి దొరాజీ చౌదరి, టీడీపీ సీనియర్ నాయకులు డాక్టర్ సూర్యనారాయణ, తాతారావు పాల్గొన్నారు.