తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలోని ఇటికాయలపల్లి, రంపయర్రంపాలెం గ్రామాల్లో అక్రమ జూదం మరియు కోడి పందేలు నిర్వహిస్తున్న స్థావరాలపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో పది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.13 వేల నగదు, రెండు కోడి పుంజులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఎస్సైలు పవన్ కుమార్, నాగమణి ఆధ్వర్యంలో సిబ్బంది పాల్గొని కేసులు నమోదు చేశారు. అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.