దేవరపల్లిలో రోడ్డు ప్రమాదం

4చూసినవారు
దేవరపల్లిలో రోడ్డు ప్రమాదం
బుధవారం దేవరపల్లి - గోపాలపురం రహదారిపై గురుప్రీత్ ధాబా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన మరో లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ ముందు భాగం ధ్వంసం కాగా, ఒకరు గాయపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపై లారీలు ఆపి జీడిపిక్కలు లోడింగ్ చేయడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.