
పెట్టుబడులు రానివ్వకుండా వైసీపీ కుట్రలు చేస్తోంది: లోకేశ్
AP: మంత్రి నారా లోకేశ్ సోమవారం ప్రెస్ మీట్లో మాట్లాడుతూ వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. "రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వైఎస్సార్సీపీ కుట్రలు చేస్తోంది. అన్ని కుట్రలను ఛేదించి, సరైన సమయంలో వాస్తవాలను బయటపెడతాం. అభివృద్ధి కోసం ఎవరు ముందుకు వచ్చినా కలిసికట్టుగా పని చేస్తాం. పెట్టుబడుల కోసం YCP సిఫార్సులను కూడా పరిగణలోకి తీసుకుంటాం. వారు సూచించిన పెట్టుబడులకు క్రెడిట్ వారికే ఇస్తాం” అని లోకేశ్ అన్నారు.




