వేసవి విజ్ఞాన శిబిరం: పుస్తక పఠనం, సైన్స్ పై విద్యార్థులకు అవగాహన

1198చూసినవారు
వేసవి విజ్ఞాన శిబిరం: పుస్తక పఠనం, సైన్స్ పై విద్యార్థులకు అవగాహన
నిడదవోలులోని శ్రీమతి & శ్రీ నందిన సుబ్బారావు లీలావతి శాఖా గ్రంధాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం జరిగింది. ఈ శిబిరంలో, పత్రికా రచయిత శ్రీ వేదుల జనార్దన్ విద్యార్థులకు పుస్తక పఠనం వల్ల కలిగే లాభాలు, సూక్తులను వివరించారు. అనంతరం, IIT బాంబే నుండి ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ చేసిన ఏలూరు ఆనంద్ కుమార్, సైన్స్, శాస్త్రవేత్తలు కనుగొన్న విషయాల గురించి విద్యార్థులకు బోధించారు. విద్యార్థిని పి. లిఖిత కిడ్నీ ఎక్సలేటరీ సిస్టం ప్రాజెక్ట్ వర్క్ చేసి వివరించింది. ఈ సందర్భంగా గ్రంధాలయాధికారి గద్దె శ్రీనివాస్, పి. లిఖితను మెడల్ తో సన్మానించారు.

సంబంధిత పోస్ట్