గోపాలపురం పరిధిలోని ఉప్పరగూడెం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ పెనుమాక సురేశ్, తాటి చెట్టుపై నుంచి ప్రమాదవశాత్తు కిందపడి తీవ్ర గాయాలపాలయ్యారు. రాజమండ్రిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం మరణించారు. సురేశ్ కోలుకుంటాడని ఆశించినా, పరిస్థితి విషమించి మరణించడంతో ఉప్పరగూడెంలో తీవ్ర విషాదాన్ని నింపింది.