దేవరపల్లిలోని జగజ్జివన్ రావు కాలనీలో తెలుగుదేశం పార్టీ నాయకులు పర్యటించి, యువజన సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్ నాయకులు గన్నమని హరికృష్ణ మాట్లాడుతూ, నూతన సంవత్సరం మొదటి రోజున యువతతో కలవడం ఆనందంగా ఉందని అన్నారు. సొసైటీ చైర్ పర్సన్ ఉప్పులూరు నమేంద్ర రామారావు, గ్రామ టీడీపీ అధ్యక్షుడు నందిగం శ్రీధర్, పిన్నమనేని నవీన్, అనపర్తి వాసు తదితరులు కమ్యూనిటీ హాల్ వద్ద యువతను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.