అగ్ని ప్రమాదంలో తాటాకు ఇళ్లు దగ్ధం

1084చూసినవారు
నల్లజర్ల మండలం దూబచర్లలో మంగళవారం సాయంత్రం విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో తాటాకు ఇళ్లు దగ్ధమయ్యాయి. మంటలు ఎగసిపడడంతో గ్రామస్థులు భయభ్రాంతులకు గురయ్యారు. అగ్నిమాపక అధికారులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ దుర్ఘటనలో సుమారు రూ. 7 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా.

సంబంధిత పోస్ట్