తూగో జిల్లాలోని నల్లజర్ల లో బుధవారం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లను వేగవంతం చేసింది. కూటమి నేతలు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఆర్డీవో, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, ఇతర అధికారులు చంద్రబాబు రాకతో బిజీగా ఉన్నారు. పర్యటన ఆకస్మికంగా ఖరారు కావడంతో అధికారులు హుటాహుటిన స్థలాన్ని పరిశీలించారు.