తూగో జిల్లా గోపాలపురం మండలంలో తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం మూడు గ్రామాలను అతలాకుతలం చేసింది. తెల్లవారుజామున 4 గంటల నుంచి ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం కురవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చెరువులు, కాలువలు పొంగి పొర్లడంతో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. రాత్రి నుంచి బిక్కుబిక్కుమంటూ ఉన్న ప్రజలు, తమ ఇంట్లోని సామాగ్రి నీటిలో తేలియాడటంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తుఫాను వెళ్లిపోయిందనుకున్న తరుణంలో ఈ జడివాన ప్రజలను మరింత భయపెట్టింది.