దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామంలో టీటీపీ రాజమండ్రి పార్లమెంటరీ వైస్ ప్రెసిడెంట్ కాకర్ల సుజనా చౌదరి శనివారం పర్యటించారు. పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె గౌరీపట్నం సెక్టార్ దుద్దుకూరు అంగన్వాడి కేంద్రాలను సందర్శించారు. బాలింతలు, గర్భిణీ స్త్రీలతో మాట్లాడి ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం వివరాలు, పోషకాహార పథకం (SNP) కింద విడుదలవుతున్న నిధులపై సిబ్బందిని ఆరా తీశారు.