పెరవలిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

4చూసినవారు
పెరవలిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
పెరవలి గ్రామంలోని రైతు బజార్ షెడ్స్ సమీపంలో, కానూరు నుంచి నరసాపురం వెళ్లే రోడ్డు పక్కన మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వయస్సు సుమారు 50 నుంచి 55 ఏళ్లు ఉంటుందని ఎస్ఐ ఎం. వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలిసినవారు 9440696642 నంబర్ను సంప్రదించాలని పోలీసులు కోరారు.

సంబంధిత పోస్ట్