ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలకు పాల్పడకుండా అడ్డుకోవాలి

1చూసినవారు
ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలకు పాల్పడకుండా అడ్డుకోవాలి
నల్లజర్లలోని వైసీపీ కార్యాలయం వద్ద గురువారం SIR ప్రోగ్రాం బూత్ లెవెల్ ఏజెంట్ల అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ హోం మంత్రి తానేటి వనిత, అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుండి తొలగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ప్రత్యర్థి పార్టీలు అక్రమాలకు పాల్పడకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.