గోపాలపురం వాదాలకుంట రోడ్డులో నూతన సంవత్సర శుభాకాంక్షల ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చింపివేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై 9వ వార్డు మెంబర్ తానేటి క్రాంతి, వైసీపీ మండల ఉపాధ్యక్షుడు గెల్లా శీను తీవ్రంగా స్పందించారు. రాజకీయ కక్షలతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. ప్లెక్సీలు చింపే సంస్కృతిని వీడాలని ప్రత్యర్థులకు సూచించారు.