కిర్లంపూడి మండలం శృంగరాయునిపాలెం సమీపంలోని ఏలేరు కాలువలో జరుగుతున్న ఇసుక తవ్వకాలపై రాజకీయ వివాదం చెలరేగింది. మంగళవారం స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పాఠంశెట్టి సూర్యచంద్ర రైతులతో కలిసి తవ్వకాల ప్రాంతాన్ని పరిశీలించి, మిషన్, లారీలను నిలిపివేయాలని కోరారు. అవినీతి ఆరోపణలపై బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు ఆయన సవాల్ విసిరారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.