త్రాగి వాహనాలు నడిపిన నలుగురు వ్యక్తులకు జైలు శిక్ష

7చూసినవారు
త్రాగి వాహనాలు నడిపిన నలుగురు వ్యక్తులకు జైలు శిక్ష
కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఆదేశాల మేరకు, రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా జగ్గంపేట పోలీసులు మంగళవారం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఐదుగురు నిందితులను పెద్దాపురం కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం నలుగురికి ఒక్కొక్కరికి ఐదు రోజుల జైలు శిక్ష విధించి పెద్దాపురం సబ్ జైలుకు తరలించారు. మరో వ్యక్తికి రూ. 10 వేల జరిమానా విధించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని సర్కిల్ ఇన్స్పెక్టర్ వై ఆర్కే శ్రీనివాస్ హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్