గోకవరం: విద్యుత్ షాక్ తో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు

1424చూసినవారు
గోకవరం ఆంజనేయస్వామి గుడి సెంటర్ లో గురువారం విద్యుత్ షాక్ తో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈనెల 22న జరగనున్న దసరా ఉత్సవాల కోసం విద్యుత్ అలంకరణ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్తంభంపై తీగలు వేస్తుండగా పెద్ద లైను విద్యుత్ తీగలు తగిలి గాయపడ్డారు. వారిని వెంటనే గోకవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్