జగన్ డాక్టర్ కు చూపించుకుంటే మంచిది: జ్యోతుల నెహ్రూ

1చూసినవారు
కాకినాడ జిల్లా జగ్గంపేటలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వంలో ముగ్గురు మహిళా మంత్రులు ఉన్నా జగన్‌కు వారు కనిపించడం లేదని, కేవలం పేరుకే కాకుండా ప్రభుత్వ విధానాలపై చురుకుగా స్పందిస్తూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా జగన్ కళ్లు, చెవులు వైద్యులకు చూపించుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు.

సంబంధిత పోస్ట్