జగ్గంపేట మండలం సగరపేట మోడల్ ప్రైమరీ స్కూల్లో గురువారం పీటీఎం సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాఠశాల అభివృద్ధికి పీటీ మాస్టారు రూ.3 లక్షలు, ఇతర దాతలు రూ.75వేలతో పాటు కంప్యూటర్లు విరాళంగా ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం అందరూ సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు, యువకులు హాజరయ్యారు.