
రేషన్ డీలర్లకు 'సార్థక్' పథకం కింద కమిషన్ మార్జిన్లు పెంపు!
ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS)ను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 'సార్థక్-పీడీఎస్' పథకాన్ని మార్చి 31, 2031 వరకు కొనసాగించాలని నిర్ణయించింది. పీఎం మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఈ పథకానికి రూ. 25,530 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. ఈ పథకం ద్వారా రాష్ట్రాల ఆహార ధాన్యాల రవాణా ఖర్చులను భరించడం, రేషన్ డీలర్ల కమిషన్ మార్జిన్లను క్రమబద్ధీకరించడం, లీకేజీలను అరికట్టడానికి AI, ML, NLP, బ్లాక్‌చైన్ వంటి అధునాతన సాంకేతికతలను ఉపయోగించడం వంటివి చేయనున్నారు. దీనివల్ల NFSA కింద సుమారు 81.35 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుంది.




