ఐడీబీఐ బ్యాంక్ నూతన శాఖను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్

2009చూసినవారు
ఐడీబీఐ బ్యాంక్ నూతన శాఖను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్
అన్ని వర్గాల ప్రజలకు బ్యాంకింగ్ సేవలు చేరువ కావాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలు పట్టణంలో ఏర్పాటు చేసిన ఐడీబీఐ బ్యాంక్ నూతన బ్రాంచ్‌ను సోమవారం మంత్రి దుర్గేష్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. దేశంలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న బ్యాంకుల్లో ఐడీబీఐ ఒకటిగా పేరుగాంచిందని, అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు నిడదవోలులో తన శాఖను విస్తరించడం సంతోషకరమని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్