గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామంలో శివాలయం వద్ద కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో శనివారం పల్లె పండుగ, సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ రూ. 30 లక్షల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఆయన సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు.