సంక్రాంతి సంబరాల ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే నెహ్రూ

7చూసినవారు
జగ్గంపేటలో జనవరి 12న జరగనున్న సంక్రాంతి సంబరాల ఏర్పాట్లను ఆదివారం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న ఆయన, ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎస్‌ఐ రఘునాథరావును ఆదేశించారు. కూటమి ప్రభుత్వం రెండో ఏడాదిగా ఈ సంబరాలను ఘనంగా నిర్వహిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ పరిశీలనలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్