
బంగాళాఖాతంలో వాయుగుండం.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో బుధవారం ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అంచనా వేశారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.




