సంక్రాంతి రద్దీతో కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద వాహనాల క్యూలు

18చూసినవారు
సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లే ప్రజల తాకిడితో రహదారులపై ట్రాఫిక్ స్తంభించింది. ముఖ్యంగా కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద ఆదివారం తీవ్ర రద్దీ నెలకొంది. విశాఖ–రావులపాలెం, విజయవాడ–విశాఖ మార్గాలకు ఇదే ప్రధాన దారి కావడంతో వాహనాలు బారులు తీరాయి. టోల్ గేట్ దాటడానికి కనీసం మూడు గంటల సమయం పడుతోందని ప్రయాణికులు వాపోతున్నారు. పండుగ సీజన్ నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, టోల్ ప్లాజా వద్ద అదనపు సిబ్బందిని నియమించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఈ రద్దీ కారణంగా ప్రయాణాలు ఆలస్యమవుతున్నాయి.

సంబంధిత పోస్ట్