జగ్గంపేటలో రబీ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది

10చూసినవారు
జగ్గంపేటలో రబీ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది
జగ్గంపేట నియోజకవర్గంలో రబీ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి సుమారు 8 వేల ఎకరాల్లో అదనంగా పంటలు సాగయ్యాయని సహాయ వ్యవసాయ సంచాలకులు గరిమెళ్ల శ్రీనివాస్ వెల్లడించారు. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందించడం వల్లే ఈ ప్రగతి సాధ్యమైందని, గండేపల్లి మండలం ఎల్లమెల్లిలో శనగల కొనుగోలు కేంద్రం ఇప్పటికే ప్రారంభమైందని, త్వరలో రబీ వరి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని బుధవారం అధికారులు తెలిపారు. రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్