పంట కాలువలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

12చూసినవారు
పంట కాలువలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
కిర్లంపూడి మండలం వేలంక గ్రామంలో ఏలేరు కాలువ నుండి వచ్చే వేలంక పంట కాలువలో సోమవారం ఒక గుర్తుతెలియని మృతదేహం లభ్యమైనట్లు సీఐ వై ఆర్ కె శ్రీనివాస్ తెలిపారు. మృతుని వయసు సుమారు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉంటుందని, నీలం రంగు షార్ట్, నిక్కరు ధరించి ఉన్నాడని ఆయన పేర్కొన్నారు. మృతుని ఆచూకీ తెలిసినవారు 9440796529 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్