వైశాఖ శుద్ధ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని రత్నగిరి కొండపై వార్షిక కళ్యాణ మండపం వద్ద రాత్రి 9 గంటలకు సత్యదేవుడు అనంతలక్ష్మి అమ్మవార్ల పరిణయ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకను చూసి భక్తజనులు పునీతులయ్యారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారమైన అన్నవరం సత్యదేవుని దివ్య కళ్యాణానికి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. అన్నవరంలో మొత్తం సందడిగా మారింది.