కాకినాడ జేఎన్టీయూలో బుధవారం వీసీ ప్రొఫెసర్ ప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సైబర్ నేరాలు, మహిళలపై హింస, మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే నష్టాల గురించి వివరించారు. విద్యార్థులు ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని ఎస్పీ బిందు మాధవ్ సూచించారు. ఉపకులపతి ప్రసాద్ కూడా విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.